NTV Telugu Site icon

Lopamudra Sinha: వార్తలు చదువుతూ.. స్పృహతప్పి పడిపోయిన న్యూస్ రీడర్.. కారణం ఏమిటంటే..?

యాంకర్ దూరదర్శన్

యాంకర్ దూరదర్శన్

Lopamudra Sinha: దేశంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏసీ గదులల్లో ఉండే ఉద్యోగులే వేడికి తట్టుకోలేక పోతున్నారు. దానికి ఉదాహరణే ఇది.. అసలేం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్ దూర దర్శన్ ఛానల్ లో వాతావరణ వార్తలు చదువుతున్న యాంకర్ లోపాముద్ర సిన్హా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన కోల్‌కొతా లోని దూరదర్శన్ స్టూడియోలో జరిగింది. వాతావరణ వివరాలు తెలియజేస్తూ అధిక ఎండ వేడి గురించి వార్తలు చదువుతున్న లోపాముద్ర అక్మాత్తుగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది ఆమె స్పృహతప్పి పడిపోయి ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. కొంత సేపటికి ఆమె లేచారు. గురువారం ఉదయం ప్రసారానికి ముందు తనకు అనారోగ్యంగా ఉందని ఆమె చెప్పారు.
READ MORE: KKR VS RCB: బెంగళూరు టార్కెట్ 223
అనంతరం ఆమె సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. “నేను ఎప్పుడూ వాటర్ బాటిల్‌ని నా దగ్గర ఉంచుకోను. అది పదిహేను నిమిషాల ప్రసారమైనా లేదా అరగంట ప్రసారమైనా. నా 21 సంవత్సరాల కెరీర్‌లో వార్తలు చదివే టప్పుడు మధ్యలో నీళ్లు తాగాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడే కేవలం 15 నిమిషాలకే గొంతు ఎండిపోయినట్లనిపించింది. వెంటనే కళ్లు మూతలు పడ్డాయి. బీపీ తగ్గి స్పృహతప్పి పడిపోయాను. అధిక వేడి కారణంగా ఇది ఇలా జరిగింది” అన్నారు. జరిగిన ఘటనపై ఆమె ఛానెల్ కు క్షమాపణలు చెప్పారు. ప్రసారాన్ని ఆపకుండా కొనసాగించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.