Lopamudra Sinha: వార్తలు చదువుతూ.. స్పృహతప్పి పడిపోయిన న్యూస్ రీడర్.. కారణం ఏమిటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lopamudra Sinha: దేశంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏసీ గదులల్లో ఉండే ఉద్యోగులే వేడికి తట్టుకోలేక పోతున్నారు. దానికి ఉదాహరణే ఇది.. అసలేం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్ దూర దర్శన్ ఛానల్ లో వాతావరణ వార్తలు చదువుతున్న యాంకర్ లోపాముద్ర సిన్హా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన కోల్‌కొతా లోని దూరదర్శన్ స్టూడియోలో జరిగింది. వాతావరణ వివరాలు తెలియజేస్తూ అధిక ఎండ వేడి గురించి వార్తలు చదువుతున్న లోపాముద్ర అక్మాత్తుగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది ఆమె స్పృహతప్పి పడిపోయి ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. కొంత సేపటికి ఆమె లేచారు. గురువారం ఉదయం ప్రసారానికి ముందు తనకు అనారోగ్యంగా ఉందని ఆమె చెప్పారు.
READ MORE: KKR VS RCB: బెంగళూరు టార్కెట్ 223
అనంతరం ఆమె సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. “నేను ఎప్పుడూ వాటర్ బాటిల్‌ని నా దగ్గర ఉంచుకోను. అది పదిహేను నిమిషాల ప్రసారమైనా లేదా అరగంట ప్రసారమైనా. నా 21 సంవత్సరాల కెరీర్‌లో వార్తలు చదివే టప్పుడు మధ్యలో నీళ్లు తాగాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడే కేవలం 15 నిమిషాలకే గొంతు ఎండిపోయినట్లనిపించింది. వెంటనే కళ్లు మూతలు పడ్డాయి. బీపీ తగ్గి స్పృహతప్పి పడిపోయాను. అధిక వేడి కారణంగా ఇది ఇలా జరిగింది” అన్నారు. జరిగిన ఘటనపై ఆమె ఛానెల్ కు క్షమాపణలు చెప్పారు. ప్రసారాన్ని ఆపకుండా కొనసాగించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!