Site icon NTV Telugu

Tommy Robinson: నేపాల్ దిశగా లండన్.. ఒక్కడి కోసం వేలాదిగా రోడ్లపైకి జనం

Tommy Robinson

Tommy Robinson

Tommy Robinson: ప్రపంచ వ్యాప్తంగా నేపాల్ సంక్షోభం ముగియ ముందుకే పలు దేశాల్లో కొత్త సంక్షోభాలు తెరపైకి వస్తున్నాయి. వాటిల్లో మరో నేపాల్‌గా ఏ దేశం మారుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా లండన్ వీధుల్లో శనివారం వేలాది మంది ఒక వ్యక్తికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ‘యునైట్ ది కింగ్‌డమ్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీతో లండన్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ర్యాలీలో పాల్గొన్న జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ర్యాలీ ఏ రాజకీయ పార్టీ కోసమో, ప్రభుత్వానికి మద్దతుగా చేసిందో కాదు. టామీ రాబిన్సన్ అనే వ్యక్తి కోసం చేసింది. ఇంతకీ ఈయన ఎవరు.. ఆయన కోసం వేలాది మంది జనం రోడ్లపైకి రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: India-Pakistan match: ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారు..

ఇంతకీ టామీ రాబిన్సన్ ఎవరు..
టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ యాక్స్లీ లెన్నాన్. ఆయన బ్రిటన్‌లో ప్రసిద్ధ మితవాద కార్యకర్తగా గుర్తించు పొందారు. 2009లో రాబిన్సన్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ (EDL) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ముస్లిం వ్యతిరేక ప్రకటనలు, నిరసనలు చేయడంతో ప్రచారం పొందింది. వలసదారుల గురించి, ముఖ్యంగా ముస్లిం సమాజం గురించి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటి ప్రకటనలు చేయడంతో ఆయనపై చాలా కేసులు నమోదు అవ్వడంతో పాటు కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి. దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆయనకు ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. కానీ ద్వేషపూరిత కంటెంట్ కారణంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలు పదేపదే నిషేధించారు.

తాజాగా ఆయన మద్దతుదారులు నిర్వహించిన ర్యాలీ దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆయన మద్దతుదారులు తనను బ్రిటిష్ గుర్తింపు, భద్రత కోసం పోరాడుతున్న నాయకుడిగా పేర్కొంటున్నారు. రాబిన్సన్ వలసలు, తీవ్రవాదం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడుతారని, అందుకే తాము ఆయనతో నిలబడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు రాబిన్సన్ సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాడని, ప్రజలను విభజిస్తున్నాడని ప్రభుత్వం, ప్రతిపక్ష పేర్కొంటున్నాయి. ఇలాంటి నాయకులకు మద్దతు ఇవ్వడం ద్వారా బ్రిటన్ సామాజిక నిర్మాణం బలహీనపడుతుందని వారు పేర్కొంటున్నారు. కొంతకాలంగా బ్రిటన్‌లో వలసలు, ఇస్లామోఫోబియా, భద్రత వంటి సమస్యలు వేడెక్కుతున్నాయి. తాజా ర్యాలీతో బ్రిటన్‌లో మారుతున్న రాజకీయాలకు, సమాజంలో పెరుగుతున్న మార్పుకు అద్దం పడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

READ ALSO: PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..

Exit mobile version