Lokesh Kanagaraj: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎప్పుడూ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా కథలు రాయనని, నా భావనకు తగ్గట్టే చేస్తాను అంటూ స్పష్టం చేశారు. ఇకపోతే, లోకేష్ మరో పెద్ద నిర్ణయాన్ని కూడా తెలిపాడు. అదేంటంటే..
AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం!
ఇకపై భవిష్యత్తులో తాను అనిరుధ్ లేకుండా ఒక్క సినిమాకూడా చేయనని తెలిచి చెప్పాడు. ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేస్తేనే నేను ఇతర ఆప్షన్స్ గురించి ఆలోచిస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాకు పాటల్లో AI అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర అనిరుధ్ ఉన్నాడు అంటూ ఘాటుగా స్పందించాడు. ఇప్పటికే ఖైదీ (కార్తి హీరోగా) చిత్రానికి సంగీతం సమ్ CS అందించారు. కానీ, లోకేష్ చెప్పిన ప్రకారం ఖైదీ 2కి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ ఫిక్స్ అయ్యినట్టే అని అర్థమవుతుంది.
Indian Navy Submarines: అణు సబ్‌మెరిన్ల దిశగా భారత నౌకాదళం.. మరో 9 కొత్త సబ్‌మెరిన్లు?
ఇక ‘కూలీ’ తర్వాత ఖైదీ 2 మొదలుపెట్టాలనేది తొలిప్లాన్ అయినా, పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం లోకేష్ ఇప్పుడు రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆయన త్వరలోనే అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
