NTV Telugu Site icon

Lokesh Kanagaraj: కాలినడకన తిరుమలకు ‘లియో’టీమ్..వీడియో వైరల్..

Leo (2)

Leo (2)

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఈమేరకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా కాలినడక ఆయన తిరుమల చేరుకున్నారు. నిన్న రాత్రి తన టీమ్‌తో కలిసి కాలినడకన ఏడుకొండలు ఎక్కారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఆ వీడియోలో లియో టీమ్‌లోని సభ్యులంతా తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన చేతికర్రలతో మెట్లెక్కుతున్నారు. టీటీడీ భద్రతా సిబ్బంది సైతం వీళ్లను రక్షణ కల్పించారు. ‘లియో’ సినిమా విడుదలకు ముందు ఆ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి ఆశీర్వాదం తీసుకోవడానికి లోకేష్ తిరుమల వెళ్లారు.. తిరుమల శ్రీవారి మెట్లు మార్గంలో చిన్నారి లక్షితను పులి చంపేసిన తర్వాత టీటీడీ ఈ చేతికర్రలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాత్రివేళల్లో తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లేవారికి ఈ కర్రలను అందిస్తున్నారు. ఒకవేళ చిరుతపులులు వచ్చినా ఈ కర్రలతో సాయంతో వాటిని బెదిరించవచ్చని, ఎదుర్కోవచ్చని టీటీడీ అధికారులు అంటున్నారు..

ఆ కర్రలను లోకేష్ టీమ్ కు కూడా అధికారులు అందించారు.. కర్రలను చేత పట్టుకొని గోవింద గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ టీమ్ అందరు ముందుకు కదిలారు.. ఇకపోతే ఈ లియో సినిమా దసరా కానుకగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. గతంలో వీరి కలయికలో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.. లియో ఖచ్చితంగా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు..