Site icon NTV Telugu

THALAPATHY 67: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దళపతి ఫ్యాన్స్

Thalapathy Vijay

Thalapathy Vijay

THALAPATHY 67: దళపతి విజయ్ అభిమానులు ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. ‘దళపతి 67’ సినిమాని డైరెక్ట్ చేయనున్న లోకేష్ కనగరాజ్ అండ్ టీం నుంచి ఒక ఫోటో బయటకి వచ్చింది. ఈ పిక్‌ని షేర్ చేస్తూ, విజయ్ ఫాన్స్ దళపతి 67 అనే హాష్ ట్యాగ్(#THALAPATHY67)ను ట్రెండ్ చేస్తున్నారు. విక్రం మూవీతో ఒక యూనివెర్స్‌ని క్రియేట్ చేసి లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ లోకీవెర్స్‌లోకి ఇప్పుడు దళపతి విజయ్ కూడా చేరనున్నాడు. ముంబై బేస్డ్ మాఫియా కథలో, విజయ్‌ని చూపించి అక్కడి నుంచి విజయ్‌ని విక్రం కథతో లింక్ చేసేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కమల్ హాసన్, సూర్య, కార్తీలతో పాటు దళపతి విజయ్‌ని ఒకే స్క్రీన్‌పైనే చూసే అవకాశం ఉంది.ఇదే జరిగితే, అలా అందరి స్టార్ హీరోలు ఒకేసారి కనిపించబోయే మూవీ, ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆన్ కార్డ్స్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Massoda Movie Review: మసూద

ప్రస్తుతం దళపతి 67 ప్రీప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, 170 రోజుల్లో వివిధ లొకేషన్స్ లో షూట్ చేసేలా ప్లాన్ చేశాడని కోలివుడ్ వర్గాల సమాచారం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్‌లో దళపతి 67 షూటింగ్‌ని కంప్లీట్ చేసి, ఆ తర్వాత మరో మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాలనేది లోకేష్ పెట్టుకున్న టార్గెట్ అని తమిళ మీడియాలో వస్తున్న వార్త. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగటివ్ రోల్ ప్లే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తల ధోని కూడా దళపతి 67 ప్రాజెక్ట్ లో నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ బయటకి రాలేదు. ఇతర కాస్ట్ వివరాలు, షూటింగ్ అప్డేట్స్‌ని త్వరలో చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుంది. బీస్ట్ సినిమాలో మినిస్టర్ డాటర్‌గా నటించిన అపర్ణ దాస్ ఒక స్పెషల్ రోల్‌లో నటించనుంది. ఖైదీ సినిమా అవ్వగానే విజయ్, లోకేష్ కలిసి మాస్టర్ సినిమా చేశారు. ఈ మూవీ అనుకున్న రిజల్ట్ రాలేదు కానీ విజయ్ మాత్రం లోకేష్‌కు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు.

Exit mobile version