NTV Telugu Site icon

Fight Club : మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న లోకేష్ కనగరాజ్ ఫైట్ క్లబ్..

Whatsapp Image 2024 01 26 At 10.30.53 Pm

Whatsapp Image 2024 01 26 At 10.30.53 Pm

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీ స్క్వాడ్ లో నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది.ఈ మూవీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ గా లోకేష్ రెండేళ్లలో రెండు హిట్స్ అందుకున్నా.. నిర్మాతగా మాత్రం ఈ ఫైట్ క్లబ్ మూవీ అతనికి నిరాశనే మిగిల్చింది.అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫైట్ క్లబ్ మూవీలో విజయ్ కుమార్ నటించాడు. ఉరియాది మూవీతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించిన విజయ్.. ఈ ఫైట్ క్లబ్ లో ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శనివారం (జనవరి 27) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫైట్ క్లబ్ మూవీ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషలలో అందుబాటులో ఉండనుంది. ఫైట్ క్లబ్ సినిమాను డైరెక్టర్ అబ్బాస్ ఏ రహమత్‌ నార్త్ చెన్నై నేటివిటీతో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. సినిమా మొత్తం నాన్‌లీనియర్ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది.కాలేజీలో ఉన్న హీరోతో పాటు అతడి ఫ్రెండ్స్‌పై ఎటాక్ చేసేందుకు విలన్ గ్యాంగ్ ప్రయత్నించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడే ఆ సీన్‌ను కట్ చేసి చివరలో దానికి ముందు, వెనుక ఏం జరిగింది అన్నది చూపిస్తారు. అయితే డైరెక్టర్‌ సినిమాలో చాలా చోట్ల అలాంటి టెక్నిక్ వాడాడు. ఫస్ట్ హాఫ్‌లో వదిలివేసిన చాలా ప్రశ్నలకు సెకండాఫ్‌లో ఆన్సర్ ఇస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశాడు.క్లైమాక్స్ లో వేర్వేరు చోట్ల ఉన్న విలన్స్‌తో హీరో ఫైట్ చేసే సీన్‌ను ఇంప్రెసివ్‌గా దర్శకుడు స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు.ఫైట్ క్లబ్ కథ రొటీన్ అయినా టేకింగ్‌ కొత్తగా అనిపిస్తుంది.

Show comments