Fight Club : మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న లోకేష్ కనగరాజ్ ఫైట్ క్లబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీ స్క్వాడ్ లో నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది.ఈ మూవీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ గా లోకేష్ రెండేళ్లలో రెండు హిట్స్ అందుకున్నా.. నిర్మాతగా మాత్రం ఈ ఫైట్ క్లబ్ మూవీ అతనికి నిరాశనే మిగిల్చింది.అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫైట్ క్లబ్ మూవీలో విజయ్ కుమార్ నటించాడు. ఉరియాది మూవీతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించిన విజయ్.. ఈ ఫైట్ క్లబ్ లో ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శనివారం (జనవరి 27) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫైట్ క్లబ్ మూవీ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషలలో అందుబాటులో ఉండనుంది. ఫైట్ క్లబ్ సినిమాను డైరెక్టర్ అబ్బాస్ ఏ రహమత్ నార్త్ చెన్నై నేటివిటీతో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. సినిమా మొత్తం నాన్‌లీనియర్ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది.కాలేజీలో ఉన్న హీరోతో పాటు అతడి ఫ్రెండ్స్‌పై ఎటాక్ చేసేందుకు విలన్ గ్యాంగ్ ప్రయత్నించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడే ఆ సీన్‌ను కట్ చేసి చివరలో దానికి ముందు, వెనుక ఏం జరిగింది అన్నది చూపిస్తారు. అయితే డైరెక్టర్ సినిమాలో చాలా చోట్ల అలాంటి టెక్నిక్ వాడాడు. ఫస్ట్ హాఫ్‌లో వదిలివేసిన చాలా ప్రశ్నలకు సెకండాఫ్‌లో ఆన్సర్ ఇస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశాడు.క్లైమాక్స్ లో వేర్వేరు చోట్ల ఉన్న విలన్స్‌తో హీరో ఫైట్ చేసే సీన్‌ను ఇంప్రెసివ్‌గా దర్శకుడు స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు.ఫైట్ క్లబ్ కథ రొటీన్ అయినా టేకింగ్ కొత్తగా అనిపిస్తుంది.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!