Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. ట్రాన్స్‌జెండర్‌ నామినేషన్‌

Trans Jendar

Trans Jendar

సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్‌ సింగ్‌ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల హక్కులతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతో పాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Death Threat: రాజస్థాన్ మంత్రికి హత్య బెదిరింపులు.. కేసు నమోదు..

బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..

రాజన్ సింగ్ చేతిలో రూ. లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, రూ.15.10 లక్షల విలువైన ఆస్తులను బ్యాంక్ ఖాతాలో ప్రకటించారు. అలాగే ఎలాంటి స్థిరాస్తులు లేవని రాజన్ సింగ్ ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది.అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానుంది.

Exit mobile version