NTV Telugu Site icon

Jammu Kashmir Budget: మూజువాణి ఓటుతో జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir Budget: అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్‌పై ప్రతిపక్షాల గందరగోళం మధ్య కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.118 లక్షల కోట్ల బడ్జెట్‌ను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది.

Read Also: Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం కొనసాగుతున్న వేట.. దేశ సరిహద్దుల్లో అప్రమత్తం

వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ మళ్లీ సమావేశమైన వెంటనే, ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా ప్రొసీడింగ్స్‌కు అధ్యక్షత వహించిన రాజేంద్ర అగర్వాల్ బీజేపీకి చెందిన జుగల్ కిషోర్ శర్మను కోరారు. బడ్జెట్‌ను ఆమోదించే ప్రక్రియ ప్రారంభించిన తర్వాత జుగల్ కిషోర్ శర్మ ఒక నిమిషం పాటు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించారు.