NTV Telugu Site icon

PM Modi: మూడోసారి ఎంపీగా నామినేషన్ వేసిన మోడీ ఆస్తులెన్నంటే..!

Pm Modi

Pm Modi

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. ఐదో విడత మే 20న జరగనుంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిసి వెళ్లి వారణాసిలో నామినేషన్ వేశారు. ముచ్చటగా మూడోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!

మంగళవారం వారణాసిలో మోడీ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ సమర్పించారు. ఇందులో దాదాపు రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇక సొంత ఇల్లు, కారు లేదని తెలిపారు. రూ.52, 920 నగదు ఉన్నట్లు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2.86 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ఉందని తెలిపారు. చేతిలో మాత్రం రూ. 52,920 నగదు ఉందని చెప్పారు. గాంధీనగర్, వారణాసిలోని రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 80,304 ఉందని వెల్లడించారు. ప్రధానమంత్రి జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్లలో పెట్టుబడిగా రూ. 9.12 లక్షలు, రూ. 2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఆదాయం 2018-19లో రూ. 11.14 లక్షల నుంచి 2022-23లో రూ. 23.56 లక్షలకు పెరిగింది.

ఇది కూడా చదవండి: Sonali Bendre: షోయబ్ అక్తర్ ‘కిడ్నాప్’ వ్యాఖ్యలపై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్

ఇక విద్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 1978లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు మోడీ ప్రకటించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. వారణాసి పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇక ఐదో విడత మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నాం..