NTV Telugu Site icon

Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్.. లైవ్ అప్ డేట్స్

Poling

Poling

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా, ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ లో8, హర్యానా 10, జమ్ముకశ్మీర్ లో 1, ఝర్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ లో 8 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

The liveblog has ended.
  • 25 May 2024 06:11 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 58 లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో 57.70 శాతం పోలింగ్ నమోదు..

    బీహార్- 52.24
    హర్యానా -55.93
    జమ్మూ-కాశ్మీర్-51.35
    జార్ఖండ్- 61.41
    ఢిల్లీ -53.73
    ఒడిస్సా- 59.60
    ఉత్తరప్రదేశ్ - 52.02
    పశ్చిమ బెంగాల్- 77.99

  • 25 May 2024 04:51 PM (IST)

    ఓటు వేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

    ఒడిశా సంబల్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 25 May 2024 03:57 PM (IST)

    లో‌క్‌సభ ఎన్నికలు: మధ్యాహ్నం 3 గంటల వరకు 49.2 శాతం ఓటింగ్ నమోదు..

    బీహార్ - 45.21%
    హర్యానా - 46.26%
    జమ్మూ కాశ్మీర్- 44.41%
    జార్ఖండ్- 54.34%
    ఢిల్లీ - 44.58%
    ఒడిశా - 48.44%
    ఉత్తరప్రదేశ్-43.95%
    పశ్చిమ బెంగాల్ - 70.19%

  • 25 May 2024 03:54 PM (IST)

    ఒడిశా అసెంబ్లీకి 3 గంటల వరకు 48.44 శాతం పోలింగ్..

    ఒడిశా అసెంబ్లీకి జరిగిన మూడో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.44 శాతం ఓటింగ్ నమోదు.

  • 25 May 2024 02:22 PM (IST)

    ఓటేసిన సీతారం ఏచూరి

    సీపీఐ(ఎం) జనరల్‌ సెక్రటరీ సీతారం ఏచూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 25 May 2024 02:21 PM (IST)

    పోలింగ్ బూత్ దగ్గర ట్రాన్స్‌జెండర్ నిరసన

    ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని దక్షిణ ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి రాజన్ సింగ్ పోలింగ్ బూత్ దగ్గర నిరసన.. పోలీసు రక్షణ మధ్య ఓటు వేసిన రాజన్ సింగ్.

  • 25 May 2024 01:54 PM (IST)

    ఓటేసిన రెజ్లర్ యోగేశ్వర్ దత్

    హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ లో పరిధిలోని బైన్స్వాల్ గ్రామంలో ఓటు వేసిన రెజ్లర్ యోగేశ్వర్ దత్

  • 25 May 2024 01:36 PM (IST)

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్

    సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదు.

  • 25 May 2024 01:31 PM (IST)

    ఓటు వేసిన ఎంఎస్ ధోని

    జార్ఖండ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓటు వేశారు. రాంచీలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎంఎస్డీ

  • 25 May 2024 01:21 PM (IST)

    ఓటేసిన నుపుర్ శర్మ..

    ఢిల్లీలోని పోలింగ్ బూత్ లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఓటు వేశారు.

  • 25 May 2024 12:23 PM (IST)

    సీడీఎస్ చౌహాన్ ఓటు వేశారు

    చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, అతని భార్య అనుపమ చౌహాన్ ఢిల్లీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

  • 25 May 2024 12:13 PM (IST)

    ఓటు వేసిన కపిల్ సిబల్

    రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 25 May 2024 12:10 PM (IST)

    ఉదయం 11 గంటల వరకు 25. 76 శాతం పోలింగ్..

    ఉదయం 11 గంటల వరకు 25.76 శాతం ఓటింగ్‌ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 36.88 నమోదు కాగా.. ఒడిశాలో 21.30 పోలింగ్.. ఇక, ఉత్తరప్రదేశ్ లో 27.06, జమ్మూ కాశ్మీర్ 23.11, జార్ఖండ్ 27.80, బీహార్ 23.67, ఢిల్లీ NCR 21.69, హర్యానా 22.09లో పోలింగ్ నమోదు అయింది.

  • 25 May 2024 11:50 AM (IST)

    ఓటు వేసిన కల్పనా సోరెన్..

    రాంచీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్

  • 25 May 2024 11:46 AM (IST)

    ఓటేసిని ఢిల్లీ సీఎం..

    ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తండ్రి, కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

  • 25 May 2024 10:43 AM (IST)

    ఓటు వేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్..

    ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 25 May 2024 10:40 AM (IST)

    ఓటు వేసిన మాజీ రాష్ట్రపతి

    మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కూడా ఓటువేశారు.

  • 25 May 2024 10:38 AM (IST)

    ఓటేసిన ఉప రాష్ట్రపతి..

    ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ తన భార్య సుదేశ్‌ ధన్‌ఖర్‌తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 25 May 2024 10:20 AM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న కపిల్ దేవ్..

    భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.. మీ నియోజకవర్గానికి సరైన వ్యక్తులను ఎన్నుకోవడం ముఖ్యం.. ప్రభుత్వం ఏమి చేయగలం అనే దానికంటే మనం ఏమి చేయగలం అనేది చాలా ముఖ్యం- కపిల్ దేవ్

  • 25 May 2024 10:18 AM (IST)

    ఓటు వేసిన ఒడిశా సీఎం

    భువనేశ్వర్‌లో ఓటు వేసిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌..

  • 25 May 2024 10:17 AM (IST)

    ఓటేసిన రాష్ట్రపతి

    ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • 25 May 2024 10:13 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 10.82 శాతం ఓటింగ్

    లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో ఎండ వేడిమి మధ్య ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఈసీ గణాంకాలు వెలువడ్డాయి. దీని ప్రకారం ఇప్పటి వరకు 10.82 శాతం ఓటింగ్ జరిగింది.

  • 25 May 2024 09:49 AM (IST)

    మహిళలు ఓటు వేయాలని స్వాతి మలివాల్ విజ్ఞప్తి

    ఓటు హక్కును వినియోగించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్.. ఈ రోజు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన రోజు.. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి.. ముఖ్యంగా మహిళలు తమ విలువైన ఓటు వేయాలని వినతి.. ఈ దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది- స్వాతి మలివాల్

  • 25 May 2024 09:47 AM (IST)

    సోనియా, రాహుల్ గాంధీ ఓటేశారు

    కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

  • 25 May 2024 09:27 AM (IST)

    కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ప్రియాంక గాంధీ

    ఢిల్లీలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి పిల్లలు రెహాన్ రాజీవ్ వాద్రా, మిరయా వాద్రాలు

  • 25 May 2024 09:23 AM (IST)

    పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆందోళన

    అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం పరిధిలో ఉద్రిక్తత.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. పోలీసులు ఎలాంటి కారణం లేకుండా పీడీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్మికులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించిన మెహబూబా ముఫ్తీ

  • 25 May 2024 08:42 AM (IST)

    స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను ఉల్లంఘించారు..

    'ఓటింగ్‌ను మందగించాలని పోలీసులకు సూచనలు వచ్చాయి.. భారత కూటమిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించిన మంత్రి అతిషి.. ఇదే జరిగితే స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను ఉల్లంఘించినట్లే.. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నాం- మంత్రి అతిషి

  • 25 May 2024 08:37 AM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న కౌసర్ జహాన్

    ఓటేసిన ఢిల్లీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్ పర్సన్ కౌసర్ జహాన్.. అభివృద్ధి చెందిన దేశ సంకల్పాన్ని నెరవేర్చేందుకు నా ఓటు వేశా.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి- కౌసర్ జహాన్

  • 25 May 2024 08:32 AM (IST)

    ఓటేసిన దుష్యంత్ టౌటాలా..

    హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఓటు వేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, జేజేపీ నేత దుష్యంత్ చౌటాలా.. మార్పు కోసం ప్రజలంతా బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి..

  • 25 May 2024 08:15 AM (IST)

    ఓటేసిన తెలంగాణ గవర్నర్

    ఝర్ఖండ్ లో ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌

  • 25 May 2024 08:11 AM (IST)

    ఓటు వేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్

    ఓటు హక్కును వినియోగించుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా

  • 25 May 2024 08:09 AM (IST)

    ఓటేసిన గంభీర్..

    మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు..

  • 25 May 2024 07:46 AM (IST)

    ఓటేసిన కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్ పూరీ

    ఢిల్లీలోని పోలింగ్ బూత్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తన భార్య లక్ష్మీ పూరితో కలిసి ఓటు వేశారు..

  • 25 May 2024 07:41 AM (IST)

    అందరూ బాధ్యతగా ఓటేయాలి

    ఆరో దశ లోక్‌సభ ఎన్నికలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని మోడీ కోరారు. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చురుకుగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నాను- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

  • 25 May 2024 07:17 AM (IST)

    ఓటు వేసిన జై శంకర్

    ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్

  • 25 May 2024 07:15 AM (IST)

    ఓటెసిన మాజీ సీఎం

    హర్యానాలోని కర్నాల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటేసిన మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్..

Show comments