NTV Telugu Site icon

Election Commission: బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలపై అభ్యంతరం.. నోటీసులు

Ec

Ec

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల ఓటింగ్ ముగిసింది. ఇక ఆరో విడత మే 25న జరగనుంది. అయితే అధికార బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. విమర్శలు.. ప్రతి విమర్శలు శృతిమించుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు భారత ఎన్నికల సంఘం 10 పాయింట్ల కఠిన ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?

అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపైనా విరుచుకుపడింది. నేతల ప్రచారశైలిలో మార్పు రావడం లేదని, ఇకనైనా సరిదిద్దుకోవాలని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Lok Sabha Elections: బీజేపీ 305 సీట్లు గెలుస్తుంది.. అమెరికా పొలిటికల్ సైంటిస్ట్ అంచనా..

ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని కాషాయ నేతలకు స్పష్టం చేసింది. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. అగ్నివీర్‌ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు.. సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని సూచించింది. ప్రచారాల్లో సంయమనం పాటించి, ప్రసంగాలను సరిచేసుకునేలా స్టార్‌ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని రెండు జాతీయ పార్టీలకు ఈసీ సూచించింది.

ఇది కూడా చదవండి: Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..