NTV Telugu Site icon

Woman Died: ఉప్పల్‌లో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లి మహిళ మృతి!

Ibraheem Patnam Bhargavi Dead

Ibraheem Patnam Bhargavi Dead

లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓ మహిళ గుండె పోటుతో మృతి చెందింది. భరత్ నగర్‌కి చెందిన విజయ లక్ష్మి.. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారు. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో విజయ లక్ష్మి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.

Show comments