Site icon NTV Telugu

Congress Manifesto Key Promises: కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. కీలక హామీలు ఇవే!

Congress Manifesto 2024 Key Points

Congress Manifesto 2024 Key Points

Congress Manifesto 2024 Key Points: సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ‘న్యాయ్‌ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, పీ చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. శనివారం జైపూర్, హైదరాబాద్‌లలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రకటించనుంది.

48 పేజీల మేనిఫెస్టోలో 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్‌ పార్టీ పొందుపరిచింది. సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించనున్నట్లు తెలిపింది. పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి రూ. 1 లక్ష, రైతులకు కనీస మద్దతు ధర, పెట్రోల్‌-డీజిల్‌ ధరల తగ్గింపు లాంటి కీలక హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని కీలక హామీలు:
# కేంద్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
# 25 లక్షల వరకు నగదు రహిత బీమా
# ఎంఎస్‌పీకి చట్టపరమైన హోదా
# మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్‌ లాను ఎంచుకొనే హక్కు
# దేశవ్యాప్తంగా కులగణన
# రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణ
# 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలకు 10,000
# కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
# పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు
# దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డుల పంపిణీ
# రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ
# రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
# వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
# బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ
# అగ్నివీర్‌ స్కీమ్‌ రద్దు
# విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం
# విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు
# పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం (మహాలక్ష్మి పథకం)
# ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్
# వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయాలనే లక్ష్యం

Exit mobile version