దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మంచి ముహుర్తాలే ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది అతిథులు లేకున్నా.. మండపాలు లేకున్నా చాలా చోట్ల ఇండ్లల్లో, గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో తక్కువ మంది బంధువులతోనే పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. సింపుల్ గా పెళ్లిళ్లు జరుగుతుండటంతో ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.
లాక్ డౌన్-పెళ్లిళ్లు: హడావుడి లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా!
