Site icon NTV Telugu

Locals Attack : గాయపడిన వారికి.. సహాయం చేసిన వ్యక్తిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు

Untitled Design (3)

Untitled Design (3)

ఈరోజుల్లో ఎవరైనా ఆపదలో ఉన్న.. కష్టాల్లో ఉన్న ఆదుకుందాం వెళితే.. అది మనకే రివర్స్ అవుతుంది. ఇలాంటి ఘటనే లక్నోలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఇద్దరు యువకులకు సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై మరికొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also:Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

లక్నోలోని బికెటి తహసీల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న సుఖ్‌వీర్ మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు సహాయం చేస్తుండగా దాడికి గురయ్యాడు. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో, బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు పూర్వా గ్రామంలోని ఎల్‌డిఎ క్యాంప్ కార్యాలయం ముందు జారిపడి పడిపోయారు. సంఘటన స్థలంలో ఉన్న సుఖ్‌వీర్ వెంటనే వారిని ఎత్తుకుని సమీపంలోని ఓం పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. గాయపడిన యువకుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వారికి ఇలా ప్రమాదం జరగడానికి కారణం సుఖ్ వీర్ అని భావించిన ఆ కుటుంబం కొంత స్థానికులతో కలిసి అతడిపై దాడి చేశారు. దీంతో సుఖ్ వీర్ తలకు తీవ్రగాయాలు అయ్యి అక్కడికిక్కడే సృహ తప్పి పడిపోయాడు. హిమాన్షు, ఆకాష్, శివ, హర్షిత్, విశాల్ తదితరులు కర్రలతో అతన్ని కొట్టారని ఆరోపణలు వచ్చాయి.

Read Also:Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్..

స్థానికుల సహాయంతో సుఖ్‌వీర్‌ను ఆసుపత్రిలో చేర్చారు. స్పృహ తిరిగిన తర్వాత.. అతను సైర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. తాను ప్రభుత్వ విధుల్లో ఉన్నానని దాడి చేసిన వారికి తెలుసునని, అయినప్పటికీ వారు తనపై దాడి చేశారని సుఖ్‌వీర్ తెలిపాడు. నిందితులపై కేసు నమోదు చేసి.. వెతుకుతున్నామని స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.

Exit mobile version