NTV Telugu Site icon

Mumbai: పట్టాలపై జారిపడ్డ మహిళ పైనుంచి వెళ్లిన రైలు.. సురక్షితంగా బయటకు

Train

Train

రైలు పట్టాలపై మనిషి పడి.. రైలు వెళ్తే బతకడం కష్టమే. అలాంటిది ఓ మహిళను సురక్షితంగా కాపాడారు. ఆమెను రక్షించడం కోసమని.. మహిళపై నుంచి వెళ్లిన రైలు, మళ్లీ నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. ఈ ఘటన సోమవారం నవీ ముంబైలోని రైల్వేస్టేషన్లో జరిగింది. ట్రాక్‌పై పడిపోయిన 50 ఏళ్ల మహిళ పై నుంచి లోకల్ ట్రైన్ వెళ్లింది. దీంతో.. రైల్వే అధికారులు వెంటనే స్పందించి వెనక్కి తీసుకురావడంతో మహిళను రక్షించారు. అయితే.. ఆ మహిళ ప్రాణపాయం నుంచి బయటపడినప్పటికీ కాళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.

Read Also: Minister Seethakka: సహించేది లేదు.. సోషల్ మీడియా ఘ‌ట‌న‌పై మంత్రి సీత‌క్క ఆగ్రహం

వివరాల్లోకి వెళ్తే.. థానే వెళ్లేందుకు బేలాపూర్ స్టేషన్‌లో ఉదయం 10 గంటల సమయంలో రైలు కోసం వేచి ఉండగా.. మహిళ పట్టాలపై జారిపడింది. అయితే.. అప్పుడే వస్తున్న లోకల్ ట్రైన్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. మహిళను రక్షించడం కోసం ఆమెపై నుంచి కొద్దిగా ముందుకెళ్లిన రైలు.. మళ్లీ వెనక్కి రాణించారు. దీంతో.. ప్రాణాలతో బయటపడింది. కాగా.. కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read Also: Ambati Rambabu: ఆంధ్ర, తెలంగాణ సీఎంల భేటీ.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

కాగా.. ఈ ఘటనకు సంబంధించి వీడియోను అక్కడున్న ప్రయాణీకులు తీశారు. రైలు నెమ్మదిగా వెనుకకు వెళ్తున్నప్పుడు మహిళ ట్రాక్‌పై పడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే రైల్వే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ముంబైలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో.. రైలు సేవలు నిలిచిపోయాయి. పట్టాలు నీటమునిగడంతో లోకల్ రైళ్ల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు.