NTV Telugu Site icon

Chennai: చెన్నై ఆవడి వద్ద పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్..

Chennai Train

Chennai Train

Chennai: చెన్నైలోని ఆవడి వద్ద ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ)కి చెందిన లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం అన్ననూర్ వర్క్‌షాప్ నుండి ఆవడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4 కోచ్‌లు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. మెరీనా బీచ్‌కు వెళ్లే ఈ రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరువళ్లూరు నుంచి సెంట్రల్ రూట్‌లో గత నెల రోజులుగా నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి.

Read Also: Devara: ఒక్క కత్తితో ఎంత పెద్ద విషయాన్ని రివీల్ చేసావ్ కొరటాల…

ఎలక్ట్రిక్ రైళ్లు నడిచే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టానికి పగుళ్లు రావడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు అధికారులు. ఈ ప్రమాదం కారణంగా సిగ్నల్ సేవలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే.. లోకో ఫైలెట్ అస్వస్థత గురి అవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తాత్కాలికంగా తిరువళ్ళూరు రూట్ లోకల్ ట్రైన్ నిలిపివేశారు రైల్వే అధికారులు

Read Also: Rajahmundry: నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ లకు సెలవు..

Show comments