Fastest runner between the wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్ ఎవరంటే.. అందరూ టక్కున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరే చెబుతారు. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ వికెట్ల మధ్య మహీ వేగంగా పరుగులు తీస్తాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలు సైతం వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేవారు. అయితే ధోనీ కంటే వేగంగా పరుగెత్తుతున్న ఓ ఆటగాడికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్యానాలో ఓ క్రికెట్ లీగ్ జరగ్గా.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఓ బ్యాటర్ ఎంఎస్ ధోనీ కంటే వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తాడు. ఇటీవల అబుబ్ షహర్, కలుఆనా సీనియర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కలుఆనా సీనియర్ టీమ్ 5 ఓవర్లలో 36 రన్స్ చేసింది. అబుబ్ షహర్ టీమ్ 4.4 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి 32 రన్స్ చేసింది. విజయానికి 2 బంతుల్లో 5 రన్స్ అవసరం అయ్యాయి. క్రీజులో నవదీప్, సంజయ్ ఉన్నారు.
కలుఆనా సీనియర్ టీమ్ స్పిన్నర్ 4వ ఓవర్ ఐదవ బంతిని వేయగా.. సంజయ్ లెగ్ సైడ్ షాట్ ఆడాడు. సంజయ్ క్రీజులో ఉండగానే.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నవదీప్ అప్పటికే పరుగు పూర్తిచేశాడు. బ్యాటర్ సంజయ్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్ళేలోపు నవదీప్ రెండో పరుగు కూడా కంప్లీట్ చేశాడు. సంజయ్ రెండో పరుగు పూర్తి చేసే లోపే నవదీప్ మూడో రన్ తీశాడు. చివరకు సంజయ్ మూడో పరుగు కోసం నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్ళాడు. నవదీప్ రన్నింగ్ చూసిన ఫీల్డర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకుసంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫాన్స్ ‘ఫాస్టెస్ట్ రన్నర్’, ‘ఇది ధోనీకి కూడా సాధ్యం కాదు’, ‘వీడెవడ్రా బాబు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Fastest runner between the wickets?
Dhoni? Kohli? ABD? No, it’s this man 👇 pic.twitter.com/zdj3Y7o1Vn
— Sameer Allana (@HitmanCricket) February 13, 2024