Loan Harassment : ఈ నెల 7వ తేదీన లోన్ యాప్ వేధింపులకు బలైన యువకుడు కుటుంబం నిరసన కు దిగింది.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద లోన్ యాప్ కి బలైన మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కు విన్నవించుకోగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోయిందని వాపోయారు.. నేటికీ 10 రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదని, ఆ కుటుంబానికి పెళ్లయిన 40 రోజులకే ఆధారాన్ని కోల్పోయమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం, మృతిని భార్యకు అర్హతకు తగ్గ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లోన్ యాప్ నిర్వాహకులని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సమస్య పరిష్కరించామని కలెక్టర్ కార్యాలయం నుంచి రోజు ఫోన్లు వస్తున్నాయని కానీ ఎలాంటి న్యాయం అందలేదని అంటున్నారు. న్యాయం జరగకపోతే తన కుటుంబానికి చావే శరణ్యం అని వాపోయారు.
Loan Harassment : న్యాయం చేయండి లేకుంటే చావే..!
- ఈనెల 7న లోన్ ఆప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య
- కలెక్టరేట్ ముందు కుటుంబం నిరసన
- న్యాయం చేస్తామని మాటిచ్చి తప్పారని బాధిత కుటుంబ ఆందోళన
Show comments