NTV Telugu Site icon

LIVE: ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు

ఏపీలో మరో బాదుడు మొదలైంది. ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీకి లాభాలు లేకుండా.. కనీసం ఆర్టీసీ బస్సులు నిర్వహించేందుకు వీలుగానే ఛార్జీల సవరణ వుంటుందన్నారు MD ద్వారకా తిరుమలరావు.

ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చింది. డీజిల్ సెస్‌ మాత్రమే విధిస్తున్నాం. పల్లె వెలుగు బస్సుల్లో రూ.2 పెంచుతున్నాం. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.5 పెంచుతున్నాం.  పల్లె వెలుగు బస్సులో రేపట్నుంచి కనిష్ఠ ఛార్జి రూ.10 వుంటుందన్నారు. డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం వుందని ఎండీ తెలిపారు. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. కోవిడ్ వల్ల గత రెండేళ్ల కాలంలో రూ. 5680 కోట్లు నష్టం వచ్చింది.