NTV Telugu Site icon

BAN Vs IRE: లిటన్‌ దాస్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డుకు బ్రేక్

Litan Das

Litan Das

బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరపున టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదు చేశాడు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా 18 బంతుల్లో 50 పరుగుుల మార్కును అందుకున్నాడు. తద్వారా మహ్మద్ అష్రాపుల్ పేరిట ఉన్న రికార్డును లిటన్ దాస్ బద్దలు కొట్టాడు. కాగా 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఆష్రాపుల్ 20 బంతుల్లో అర్థ శతకం చేశాడు. జొహన్నస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో ఈ ఘనత సాధించాడు.

Also Read : Virat Kohli : నా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా ఇద్దరు స్టార్లే

ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్లో టీమిండియాతో మ్యాచ్ లో 21 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని ఆష్రాపుల్ తర్వాతి స్థానంలో నిలిచాడు లిటన్ దాస్. తాజా మ్యాచ్ తో అతడిని అధిగమించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఐర్లాండ్ తో రెండో టీ20లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న లిటన్ దాస్ 10 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 83 పరుగులు చేశాడు. లిటన్ దాస్ కు తోడు మరో ఓపెనర్ రోనీ టాలూక్దర్ 44 పరుగులతో రాణించగా.. బంగ్లాదేశ్ 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో 77 పరుగుల తేడాతో బంగ్లా గెలిచింది.

Also Read : The Sun: సూర్యుడి ఉపరితలంపై భారీ రంధ్రం.. భూమికి ప్రమాదమా..?

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ ఇప్పటికే మ్యాచ్ గెలిచి సిరీస్ లో ముందడుగు వేసింది. మేము గత కొన్ని ఇన్సింగ్స్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నామని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పేర్కొన్నాడు. మ్యాచ్ ప్రారంభమైన నుంచి ముగిసే వరకు ఎలా ముందుకు సాగాలి అంటూ అందరితో చర్చించి ముందుకు వెళ్లానంటూ షకీబ్ అల్ హసన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కు గట్టిపోటీ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామంటు తెలిపాడు.