Site icon NTV Telugu

LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే?

Little Hearts

Little Hearts

#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంలో సహాయపడింది. రెండు కోట్లతో నిర్మించిన లిటిల్ హార్ట్స్ వరల్డ్ వైడ్ గా రూ. 40 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది.

Also Read : IBOMMA : మాతో పెట్టుకోవద్దు.. పోలీసులకు ఐ బొమ్మ స్వీట్ వార్నింగ్

లిటిల్ హార్ట్స్ ను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క బయ్యర్ కి కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. అంతలా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను నిర్మించిన ఈటీవీ విన్ ఇప్పుడు ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. ఈ రోజు నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన ఈ చిన్న సినిమా ఓటీటీలో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. థియేటర్ లో రిలీజ్ చేసిన వర్షన్ కాకుండా ఎడిటింగ్ లో కట్ చేసిన ఒరిజినల్ వర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. అలాగే లిటిల్ హార్ట్స్ 2 కు లీడ్ ఇస్తూ స్ట్రీమింగ్ చేస్తోంది.

Exit mobile version