Site icon NTV Telugu

Viral Video: ఓ పిల్లవాడు పులితో షికారు ఎలా చేస్తున్నాడో చూడండి..! వీడియో వైరల్

Tiger

Tiger

మాములుగా అయితే కుక్కలను ఎంతో ముద్దుగా ఇష్టంగా పెంచుకుంటాం. ఏటైనా బయటకు వెళ్లినప్పుడు వాటి మెడకు గొలుసు కట్టి తీసుకెళ్తుంటాం. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఓ పిల్లవాడు మాత్రం ఏకంగా పులికే గొలుసును కట్టి ఏం చక్కా పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్థాన్‌కు చెందిన నౌమాన్ హసన్ అనే వ్యక్తి తన పెంపుడు పులులను వీడియోలలో ప్రదర్శించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. చాలా మంది వ్యక్తులు ఇతర నైపుణ్యాలతో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నప్పటికీ.. హసన్ మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలతో ప్రశంసలు, విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు.

MP Margani Bharat: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. అసంతృప్తి చెందే ఎమ్మెల్యేలకు ఎంపీ హితబోధ

ప్రమాదకరమని తెలిసినా.. పెంపుడు పులులను కలిగి ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవల, అతను ఒక పిల్లవాడు నమ్మకంగా పులి గొలుసును పట్టుకుని తిరుగుతున్న వీడియోను పోస్ట్ చేసి ఇంటర్నెట్‌లో వివాదాన్ని రేకెత్తించాడు. అయితే కొంతసేపటి తర్వాత.. పులిని పట్టుకున్న గొలుసును వదిలేశాడు. దీంతో.. పులి దాడికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ.. పిల్లవాడిని రక్షించడానికి పక్కన ఉన్న వ్యక్తి సరైన సమయంలో జోక్యం చేసుకున్నాడు.

MP Margani Bharat: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. అసంతృప్తి చెందే ఎమ్మెల్యేలకు ఎంపీ హితబోధ

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల రియాక్షన్‌లతో కామెంట్స్ సెక్షన్‌ను ముంచెత్తారు. ఒక వినియోగదారు “ఇది హాస్యాస్పదంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. మరొకరు, “ఇది మానవ మేధస్సు యొక్క అత్యంత మూర్ఖపు చర్య.” అని తెలిపారు. మరొక వినియోగదారు.. “ఈ ప్రపంచంలో మూర్ఖులకు కొరత లేదు.” అని కామెంట్స్ చేశాడు.

Exit mobile version