NTV Telugu Site icon

Viral Crocodile : వామ్మో వీడి ధైర్యం తగలెయ్యా.. మొసలినే మోసుకెళ్తున్నాడు

New Project (4)

New Project (4)

Viral Crocodile : మొసళ్లు చాల ప్రమాదకరమైనవి. వాటిని చూస్తేనే చాలామంది భయపడతారు. మరికొంతమంది వాటిని చూసేందుకు కూడా ఇష్టపడరు. మొసళ్లు ఉభయచర జీవులు. నేల మీద నీటిలోపల జీవించగలవు. అవి దాడి చేస్తే మామూలుగా ఉండదు. ఈ మొసళ్ళు వాటికి ఆకలేస్తే అకస్మాత్తుగా దాడి చేస్తాయి. అవి ఎటాక్ చేశాయంటే వాటి గురి తప్పదు. అలాంటి మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు మొసలిని తన వీపుపై మోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసిన వాళ్లు షాక్ తింటున్నారు.

Read Also: Women Pilots: ఆకాశంలో ఆమె.. భారత పైలెట్లలో 15 శాతం మహిళలే.. గ్లోబల్ యావరేజ్‌ని మించి..

ఒక చిన్న పిల్లవాడు తన వీపుపై మొసలితో నిర్భయంగా వీధిలో నడుస్తున్నాడు. గత నెల ఫిబ్రవరి 16న ట్విట్టర్‌లో షేర్ చేసిన క్లిప్ ఆ తర్వాత తొలగించబడింది. బాలుడు మొసలి ముందు కాళ్లను పట్టుకుని భుజాలకు చుట్టి ఉండగా, మిగిలిన మొసలి వెనుక నుంచి వేలాడుతూ కనిపించింది. బాలుడి ఈ ధైర్యసాహసాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు కూడా చేశారు. వీడియోలో స్థలం గురించి ప్రస్తావించనప్పటికీ, వీడియో తీసిన ప్రదేశాన్ని బట్టి ఇక్కడ చేపల వేట ఎక్కువగా జరుగుతున్నట్లు సూచిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందించారు. “మొసలి అలసిపోయింది” అని ఒక నెటిజన్ రాశారు. “మొసలికి మంచి స్నేహితుడు దొరికాడు” అని మరొకరు చెప్పారు.