AP Holidays 2024: 2023 ఏడాది ముగింపు దశకు వచ్చేశాం.. నేటితో నవంబర్ ముగించుకుని.. రేపు డిసెంబర్లో అడుగుపెట్టబోతున్నాం.. ఇక, డిసెంబర్‌తో 2023కి బైబై చెప్పేసి.. 2024 ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సాధారణ సెలవులు, ఇతర సెలవులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2024లో సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జరగనున్న పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తంగా 20 రోజులు సాధారణ సెలవులు ఉండగా.. మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా పేర్కొంది ఏపీ సర్కార్..
Read Also: Karnataka: స్థానిక ప్రజలకే కాదు, రోడ్లపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.. కర్ణాటక హైకోర్టు తీర్పు
సాధారణ సెలవుల విషయానికి వస్తే జనవరి 15 సంక్రాంతి, 16న కనుమ, 26న రిపబ్లిక్ డే, మార్చి 8వ తేదీన మహాశివరాత్రి, 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, 9న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామ నవమి, జూన్ 17న బక్రీద్, జులై 17న మొహరం, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, 26న శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్ 7 వినాయక చవితి, అక్టోబర్ 2 గాంధీ జయంతి, 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవులు ప్రకటించింది..
ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవులతో పాటు, ఐచ్ఛిక సెలవులను కింది టేబుల్స్‌లో పరిశీలించవచ్చు..

