NTV Telugu Site icon

Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..

Liquor Truck Accident

Liquor Truck Accident

ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన మానవత్వానికి కలకం తెచ్చేలా ఉంది. మద్యం ట్రక్కు ప్రమాదం జరిగిన తరువాత., చుట్టుపక్కలవారు క్షతగాత్రులను నిర్లక్ష్యంగా వదిలివేసి, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యాన్ని దోచుకున్నారు. విదేశీ, స్వదేశీ మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయలో తీసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ లలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Jupalli Krishna Rao: కొత్త డిస్టిలరీ కంపెనీపై ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రకటన విడుదల..

తెల్లవారుజామున సుమారు 4 గంటలకు, మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీబాబాద్ హైవే వెంబడి జత్‌పురా బోండా గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో మరో గుర్తు తెలియని వాహనంకు ఢీకొట్టింది. రోడ్డు మార్గంలో అకస్మాత్తుగా ఆవు కనిపించడం వల్లే ప్రమాదానికి కారణమని, దానిని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ పక్కకు తిప్పడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిందని అధికారులు తెలిపారు.

T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..

ఈ ఘటనలో ట్రక్కు నుండి మద్యం సీసాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. దీని ఫలితంగా చాలా సీసాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే, బాటిళ్లలో కొన్ని సీసాలు పాడైపోలేదు. ప్రమాదం గురించి తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న కొందరు ప్రజలు చెక్కుచెదరకుండా ఉన్న బాటిళ్లను పట్టుకెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై నడుస్తున్న గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా ప్రజలు మద్యాన్ని దోచుకుంటున్నట్లు ఈ సంఘటనను చూపే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Show comments