Site icon NTV Telugu

Liquor Shops : నేడు వైన్‌ షాపుల రిజర్వేషన్లపై డ్రా తీయనున్న కలెక్టర్లు

Liquor Sales

Liquor Sales

ఎక్సైజ్ శాఖ వచ్చే రెండేళ్ల (2023-25) మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం నేడు కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ సన్నాహాలు ప్రారంభించింది.

Also Read : IND vs WI: నేడే భారత్-విండీస్ తొలి టీ20.. హైదరాబాద్‌ కుర్రాడు అరంగేట్రం! తుది జట్టు ఇదే

దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.రెండు లక్షలుగా (నాన్‌ రిఫండబుల్‌), స్పెషల్‌ రీటెయిల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ధారించారు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్‌ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్‌ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Dattatreya Stotram: శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం వింటే పుణ్యం లభిస్తుంది

Exit mobile version