Site icon NTV Telugu

Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

లిక్కర్ స్కాం క్లైమాక్స్‌కి చేరింది. నాలుగు నెలలుగా లిక్కర్ స్కాంపై సిట్ విచారణ చేస్తోంది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ నుంచి కేసులో నిందితుల అరెస్ట్ మొదలు పెట్టింది. మొదటి కేసులో మిథున్ రెడ్డి కీలకమని సిట్ చెబుతోంది. ఒక సారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని విచారించింది. కేసులో టెక్నికల్ ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచింది. ఇప్పటికే మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్టు గుర్తించింది. ఆ వివరాలను మిథున్ రెడ్డి ముందు పెట్టి విచారిస్తోంది. గతంలో డిస్టలరీస్, ఇతర సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్లతో పాటు విచారణలో సేకరించిన ఆధారాలతో సహా విచారణ కొనసాగుతోంది. 4 గంటలుగా మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది.

READ MORE: Infiltrators: అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

ఇదిలా ఉండగా.. ఈ కేసుపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టింది.. ఈ కేసు ఒక తప్పుడు కేసు అని మండిపడ్డారు. ప్రస్తుతానికి వేధించి రాజకీయ ఆనందం పొందవచ్చు.. కానీ, ఇది నిలబడే కేసు కాదు.. ఈ కేసును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తాం.. కేసులో ఏం సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అన్నారు. ఆధారాలు లేవని వాళ్లు చెబితే రేపే తీసి వేస్తారు.. అందుకే ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.

READ MORE: Minister Satyakumar: రపా రపా డైలాగ్‌ కాదు.. బాలకృష్ణ, మహేష్ బాబులా చేయండి చూద్దాం..

Exit mobile version