MP Midhun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. దానితో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి తీసుకుని వెళ్లుతున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది, ఏసీబీ పోలీసులు ప్రత్యేక వాహనంలో రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుంది. రిమాండ్ పొడిగింపు నిమిత్తం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి ఆయన తీసుకుని బయలుదేరారు పొలిసు అధికారులు.
Saiyaara OTT: ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైయారా.. ఎందులో చూడచ్చంటే?
నేడు మిధున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ కొనసాగనుంది. దీనితో మిధున్ రెడ్డి బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ మంజూరు అవుతుందని వైస్సార్సీపీ పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి నేడు కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వనుందో.
