Liquor Sales: ఎన్నికల కమిషన్ ఆంక్షలు.. సీసీ కెమెరాలు..ము మ్మరంగా తనిఖీలు… మద్యం మాట వినిపించకుండా అధికారులు, పోలీసులు అష్టదిగ్బంధనం చేసినా అది తన టార్గెట్ రీచ్ అవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా మద్యం పార్టీల నేతలకు చేరిపోతూనే ఉంది. రోజువారీ మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే పెరగకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఆంక్షల్లాగే ఉన్నాయి. మద్యం మాత్రం అందరి కళ్లుగప్పి బయటకు వస్తూనే ఉంది. కంపెనీల నుంచే నేరుగా నేతలకు చేరుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని పార్టీలకు కర్ణాటక, తమిళనాడు నుంచి సరుకు వస్తోందని పోలీసులు అంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కూడా లిక్కర్ తరలిపోతోంది. తెరిచీ తెరవగానే నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నాయి వైన్ షాప్‌లు.
Read Also: PM Modi: ‘‘ఒక సంవత్సరం, ఒక ప్రధాని’’.. ఇండియా కూటమిపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
2023 మార్చిలో 2 వేల 357 కోట్ల రూపాయలు విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 27 లక్షల 63 వేల 924 లిక్కర్ కేసులు, 9 లక్షల 78 వేల 331 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. 2024 మార్చిలో 2 వేల 590 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 29 లక్షల 13 వేల 463 లిక్కర్ కేసులు, 10 లక్షల 54 వేల 886 బీర్ కేసులు సేల్ అయ్యాయి. మార్చి నెల మొదట్లోనే ఎన్నికల కోసం ముందు జాగ్రత్తగా మద్యం కొనుగోళ్ళు చేశారు మందుబాబులు. మార్చిలో అత్యధిక సేల్స్ జరగడంతో ఏప్రిల్‌లో అమ్మకాలు తగ్గాయి. ఒక్క మార్చిలోనే 9.87 శాతం అమ్మకాల పెరుగుదలకు ఏప్రిల్ , మే లలో ఎన్నికల ఆంక్షలు ఉండటమే కారణమని అంచనా వేస్తున్నారు.
Read Also: Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
మందు కోసం షాపుల దగ్గర కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఎండను లెక్కచేయకుండా దుకాణాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అయితే తెరిచిన గంటకే నో స్టాక్ బోర్డు పెట్టి మూతపడుతున్నాయి మద్యం షాపులు. డబ్బులు పెట్టినా మందు దొరక్కపోవడంతో షాపు నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు కస్టమర్లు. సరుకు ఉన్నా తమకు అమ్మకుండా పక్కదారి పట్టిస్తున్నారంటూ వీరంగం వేస్తున్నారు. అయితే ఇచ్చిన టార్గెట్ పూర్తయ్యాక షాపులు మూసేస్తున్నామంటున్నారు సేల్స్‌మెన్స్.
