NTV Telugu Site icon

CP Ambar Kishor Jha : ఈ నెల 16న వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు బంద్

Cp Ambar Kishor Jha

Cp Ambar Kishor Jha

ఈ నెల 16న నిమజ్జనం రోజు వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్‌ 16 (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఈ నెల 16 ఉదయం 6:00 గంటల నుండి మరుసటి రోజు 17 ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు (మద్యం దుకాణాలు) మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. .గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు సెప్టెంబర్‌ 16 న మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Bigg Boss Telugu 8: రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్.. బయటకు వచ్చేది ఎవరంటే?

Show comments