NTV Telugu Site icon

Liquor Sales Banned: మందు బాబులకు అలర్ట్.. ఆ మూడు రోజు వైన్స్‌లు, బార్లు బంద్‌

Liquor

Liquor

Liquor Sales Banned: తెలంగాణలో మందు బాబులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చేసింది.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో.. ర్యాలీలు, సభలు, ప్రచారంతో హోరెత్తిస్తున్న రాజకీయ నేతలు.. అక్కడక్క మందు కూడా పంపిణీ చేస్తున్నారట.. అయితే, ఎన్నికల సమయంలో వరుసగా మూడు రోజులు వైన్‌ షాపులు, బార్లు మూత పడనున్నాయి.. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభం కాగా.. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.. ఇక, పోలింగ్‌కు రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది.. అదే సమయంలో ప్రలోభాలకు తెరలేవనుంది.. ఇక. వరుసగా మూడు రోజులు పాటు మద్యం షాపులు క్లోజ్‌ కానున్నాయి..

Read Also: Samajika Sadhikara Bus Yatra: ఏడో రోజుకు చేరిన సామాజిక సాధికార యాత్ర.. ఈ రోజు ఎక్కడంటే..

ఈ నెల 28, 29 తేదీలతో పాటు పోలింగ్‌ జరగనున్న 30 తేదీ కూడా మద్యం షాపులు అన్నీ మూతపడనున్నాయి.. మొత్తంగా మూడు రోజుల పాటు.. అంటే 28వ తేదీ సాయంత్రం మూసివేస్తే.. మళ్లీ డిసెంబర్‌ 1వ తేదీనే ఓపెన్‌ చేసే అవకాశం ఉంది.. మరోవైపు.. నవంబర్‌ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి.. ఆయా బార్లు, వైన్‌ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చి.. మూడురోజుల పాటు బంద్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ఎన్నికల సమయంలో.. లిక్కర్‌ సేల్స్‌ ఫుల్‌గా ఉన్నా.. వైన్‌ షాపులు, బార్లకు వెళ్లేవారి సంఖ్య మాత్రం చాలా వరకు తక్కువే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.