NTV Telugu Site icon

Liquor Price Hike : మందుబాబులకు అలర్ట్‌.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

Liquor Stock

Liquor Stock

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు కొంత అదనపు ఆదాయం కావాలి. ఈ మేరకు ప్రస్తుతం మద్యం ధర పెంచితే అదనపు ఆదాయం వస్తుంది. ఇలా అన్ని రకాల ఆల్కహాల్ బ్రాండ్ల ధరలను 20-25% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. ఈ ధరలు పెంపుపై వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏటా ప్రభుత్వానికి రూ.37 వేల కోట్లు వరకు సమకూరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాలు అమలుకు ఈ పెరిగిన ఆదాయం కచ్చితంగా అక్కరకు వస్తుంది. కాబట్టి దాదాపుగా ధరలు పెంచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.