NTV Telugu Site icon

Liquor Policy Case: రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరు కానున్న కవిత..

Kavitha

Kavitha

Liquor Policy Case: ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించింది సీబీఐ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని అభియోగం గావించింది. ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఇవాళ లిక్కర్ కేసు విచారణ జరగనుంది.

Bank Jobs : బ్యాడ్ న్యూస్.. బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు స్వస్తి.. ఇదే కారణం

నేడు లిక్కర్ కేసులో సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టనున్నారు న్యాముర్తులు. నేడు కవిత తోపాటూ ఇతర నిందితులను వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పర్చనున్నారు. ఈ కేసును జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.

Viral News: సింగిల్స్‌కు కిర్రాక్ ఆఫర్.. హగ్‌కు రూ.11, ముద్దుకు 110..