NTV Telugu Site icon

Video Viral : బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగోపరుగు

Circus

Circus

Video Viral : జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది. ఇలాంటి ఘటనే చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ లుయోయాంగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. సర్కస్‌లో విన్యాసాలను వీక్షిస్తూ ఆనందిస్తున్న జనంపైకి ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకుని రెండు సింహాలు ఒక్కసారిగా దూసుకువచ్చాయి. దీంతో సర్కర్ వీక్షించేందుకు వచ్చిన వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..

ఈ సర్కస్‌ నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ రింగ్‌ లోంచి దూకేందుకు సింహాలు మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్‌ చేయని డోర్‌ నుంచి రెండు సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి. దీంతో జనం భయంతో పరుగుతీశారు. అప్రమత్తమైన నిర్వాహకులు ఆ సింహాలను పట్టుకొని తిరిగి బోనులో బంధించారు. ఈ ఘటనతో సర్కస్‌ను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

Show comments