Site icon NTV Telugu

Lionel Messi: హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన.. MCHRDలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్‌తో సందడి..!

Cm Revanth

Cm Revanth

Lionel Messi: అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానుండగా.. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ సంకల్పానికి భాగంగా, మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Black Friday Deal: రూ.19,999ల Fire-Boltt Ninja Call Pro Plus స్మార్ట్వాచ్ కేవలం రూ.998కే.. ఎక్కడ కొనాలంటే..?

ఇదిలా ఉండగా.. మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ పాల్గొనే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. రాత్రి సచివాలయం నుండి నేరుగా MCHRD కు వెళ్లి అక్కడే సుమారు గంటపాటు ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెస్సీ హైదరాబాద్ పర్యటనతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ముఖ్యంగా మెస్సీతో సీఎం రేవంత్ భేటీ, ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు, బ్రాండ్ అంబాసడర్ ప్రతిపాదన ఇవన్నీ తెలంగాణకు గ్లోబల్ లెవెల్‌లో కొత్త అవకాశాలను తెరుచుకోనున్నాయని అనుకోవచ్చు.

Virat Kohli: నేను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మను.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Exit mobile version