NTV Telugu Site icon

Lion: ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా.. ఆకులు తింటున్న సింహం

Lion

Lion

Lion Eating Green Leaves: సింహం..దీన్ని చూస్తే గుండెల్లో భయం, దీని గాండ్రింపు వింటే కాళ్లలో వణుకు ఎవరికైనా పుట్టాల్సిందే. జంతువులలో సింహానికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది ఎంత ఆకలిగా ఉన్నా వేరే జంతువులు వేటాడిన వాటిని ముట్టుకోదు. తానే స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంతేకాదు ఎంత ఆకలిగా ఉన్నా మాంసాన్ని తప్పా గడ్డి, ఆకులు లాంటి వాటిని ముట్టుకోదు. అందుకే మన సామెతల్లో కూడా ఎంత ఆకలి వేసినా సింహం ఎలా గడ్డి తినదో ఎంత అవసరం ఉన్నా నేను తప్పు చేయను అని చెబుతూ ఉంటారు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం అలాంటిదేముండదు అవసరమైనప్పుడు మనిషిలాగానే సింహం కూడా గడ్డి తింటుంది అనుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ వింత జరిగిన క్షణాల్లో దర్శనమిస్తోంది. చేతిలో కెమెరాలు ఉండటంతో ఆ వింతలను బంధించి చాలా మందితో పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వింతే జరిగింది. క్రూరజంతువైన సింహం ఆకులు తింటూ కెమెరా కంటపడింది. దీంతో దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

Also Read: Viral Video: వీళ్లు నిజంగా సూపర్బ్ పోలీసులే.. స్కూటీపై వెంబడించి దొంగలను పట్టుకున్నారు

జీవితంలో మాంసం తప్ప వేరేది తినదు అనుకున్న సింహం ఓ చెట్టు ఆకులను పరాపరామని తినేస్తోంది. అంతేకాదు మిగిలిన జంతువులలాగా చెట్టు కొమ్మలను ఎగిరి అందుకోని మరీ తినేస్తోంది. ఒకటి రెండు కాదు ఆవులు, గేదెలు తిన్నట్లు కొమ్మలకు ఉన్న ఆకులు అన్నీ తినేస్తోంది. ఈ వీడియో చూస్తే ఏందయ్యా ఇది నేను చూస్తున్నది నిజమేనా అని అనుకోవడం పక్కా. ఇది భ్రమేమో అని కళ్లు తుడుకొని మరీ మళ్లీ ఈ వీడియోను చూస్తారు. సింహం ఏదైనా పూజ చేస్తుందేమో అందుకే నాన్ వెజ్ మానేసిందేమో అని దీనిని చూసిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు డైటింగ్ చేద్దామని ఈ సింహం డిసైడయినట్లు ఉంది  అంటూ ఇంకొందరు అంటున్నారు. హింసను మానేసి అహింసలోకి వచ్చేసిందేమో అంటూ మరికొందరు స్పందిస్తు్న్నారు. మొత్తానికి ఆశ్చర్యం కలిగిస్తు్న్న ఈ వీడియో తాము చూడటంతో పాటు తమ వారికి కూడా షేర్ చేస్తున్నారు చాలా మంది.

Show comments