MahaBharat : తెలుగు, తమిళ పరిశ్రమల్లో అనేక మంది దర్శకులు మహాభారతం పై సినిమా తీయాలనుకుంటున్నారు. అందులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. ఆయన మహాభారతం ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఇది తెరకెక్కించడానికి ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చు.
అయితే, ఆయన కంటే ముందే ఈ సినిమా తీసే సాహసం చేస్తున్నారు కన్నడ, తమిళ దర్శకుడు లింగుస్వామి. మహాభారతం మొత్తం తీసే భారం కాకుండా మహాభారతం లోని అర్జునుడు, అభిమన్యుల కథను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. లింగుస్వామి, మహాభారతంలోని ఈ భాగాన్ని 700 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. ఈ చిత్రం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించనున్నారు. అభిమన్యుడు అర్జునుని కుమారుడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు అభిమన్యుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది.
Read Also:Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం
ఈ చిత్రం కథ ప్రారంభంలో అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉండగా, తన కుమారుడు అభిమన్యుడు విరాట రాజ్యానికి వెళ్లి రాజు కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వివాహం అనంతరం, వీరిద్దరి జీవితంలో అసలైన యుద్ధం ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు చేసిన త్యాగం, గౌరవం సినిమాకు ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి.
లింగుస్వామి ఈ చిత్రాన్ని ఎంత వరకు విజయవంతంగా తెరకెక్కిస్తారో, సినిమా విజువల్స్, సాంకేతిక పరిజ్ఞానం ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటాయో అన్నది చూడాలి. మహాభారతంకి సంబంధించిన ఈ భాగం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని ఆశిస్తూ, లింగుస్వామి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మొదలుపెట్టారు.
Read Also:PM Modi: కుంభమేళాపై ప్రతిపక్షాలది ‘‘బానిస మనస్తత్వం’’.. మోడీ ఆగ్రహం..