Site icon NTV Telugu

Lingoccha :లింగొచ్చా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2024 01 05 At 11.15.06 Pm

Whatsapp Image 2024 01 05 At 11.15.06 Pm

కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించిన లింగొచ్చా సినిమా గతేడాది అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది.లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు.. లింగొచ్చా మూవీకి ఆనంద్ బడా దర్శకత్వం వహించారు. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు లింగొచ్చా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.లింగొచ్చా సినిమా జనవరి 13వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. సంక్రాంతి సీజన్‍లో ఆహా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుంది.లింగొచ్చా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆహా నేడు ట్వీట్ చేసింది. “హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఆట! లింగొచ్చా ఆహాలో వస్తోంది.. పారా హుషార్. ఈ రొమాంటిక్ డ్రామాను జనవరి 13న ఆహాలో చూడండి” అని ఆహా వెల్లడించింది.లింగొచ్చా చిత్రంలో కార్తీక్ రత్నం సరసన సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా నటించారు. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్ మరియు ఉత్తేజ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు. ఆనంద్ బడా డైరెక్షన్ చేసిన ఈ చిత్రానికి బికాజ్ రాజ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని యాదగిరి రాజు నిర్మించారు.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే పాతబస్తీలో ఉండే శివ (కార్తీక్ రత్నం)మరియు ముస్లిం అమ్మాయి నూర్జహాన్ (సుప్యార్ధీ సింగ్) చిన్నతనంలోనే ప్రేమలో పడతారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. అయితే, నూర్జహాన్ హఠాత్తుగా దుబాయి వెళ్లిపోతుంది. అయినా ఆమెపై శివకు ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.నూర్జహాన్ దుబాయ్ లో మెడిసన్ చదివి.. ఇండియాకు తిరిగి వచ్చేస్తుంది. మళ్లీ పాతబస్తీలోని తన ఇంటికి వస్తుంది. దీంతో శివ మళ్లీ నూర్జహాన్ వద్దకు వెళతాడు. మొదట్లో శివకు మళ్లీ దగ్గరయ్యేందుకు ఆమె సుముఖంగా ఉండదు. అయితే, ఆ తర్వాత శివ మనసు తెలుసుకొని ఆమె దగ్గరవుతుంది. మళ్లీ వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుంది. అయితే, ఈ విషయం నూర్జహాన్ ఇంట్లో తెలిసిపోతుంది. నూర్జహాన్ సోదరుడు అన్వర్ (కృనాల్ కౌశిక్) వారి ప్రేమను అంగీకరించకుండా నూర్జహాన్‍కు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటాడు. మరి శివ, నూర్జహాన్ ప్రేమ సక్సెస్ అయిందా..వారికి ఎదురైన ఇబ్బందులు ఏంటి..అనేదే లింగొచ్చా ప్రధాన కథ

Exit mobile version