NTV Telugu Site icon

AP High Court: లింగమనేని రమేష్ పిటిషన్‌.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Ap High Court

Ap High Court

AP High Court: లింగమనేని రమేష్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ వాదనలు వినిపించటానికి అవకాశం లేదని తీర్పు ఇచ్చిన కింది కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు లింగమనేని రమేష్ న్యాయవాది.. అయితే, స్టే ఇవ్వటానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది.. అంతే కాదు.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.. కాగా, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరకట్టపై నివసిస్తున్న లింగమనేని రమేష్ ఇంటి జప్తుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో గత నెలలో సీఐడీ పిటిషన్ వేసింది.. ఇక, విచారణలో లింగమనేని రమేష్‌ కి వాదనలు వినిపించే అవకాశం లేదని కింది కోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు లింగమనేని రమేష్‌.. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Dimple Hayathi : ఆ భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన డింపుల్ హయతి…?