NTV Telugu Site icon

Lift Fell Down: బట్టల షాఫులో తెగిపడిన లిఫ్ట్‌.. పలువురికి తీవ్రగాయాలు

Lift

Lift

Lift Fell Down: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రమాదం జరిగింది. సదాశివపేటలోని కాసం బట్టల షాపులో లిఫ్ట్‌ తెగిపడగా పలువురికి గాయాలయ్యాయి. బట్టల షాపుకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 10 మంది కుటుంబసభ్యులు లిఫ్ట్‌ ఎక్కగానే కరెంట్‌ పోయింది. కరెంట్‌ పోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడింది. లిఫ్ట్‌లో ఉన్న పలువురికి గాయాలు కాగా…సంగారెడ్డి లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఓవర్ లోడ్ కారణంగానే లిఫ్ట్ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్‌ సామర్థ్యానికి మించి జనం ఎక్కడంతో వైర్లు తెగి ప్రమాదం జరిగినట్లు బట్టల యాపు యాజమాన్యం పేర్కొంటోంది.

Read Also: Attack On Man: వాయిదాలు మిస్సయినందుకు వ్యక్తి పై దాడి చేసిన ఫైనాన్స్ కంపెనీ లోన్ ఏజెంట్..

Show comments