భారతీయ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తుంది.. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు.. అందులో ఆడపిల్లలకు కూడా మంచి ఫథకాలు ఉన్నాయి. అందులో ఒకటి కన్యాదాన్.. ఈ పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది.. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసీ ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రోజుకు రూ. 121 డిపాజిట్ చేయడం అంటే నెలకు సుమారుగా రూ.3600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ పిల్ల ఒక సంవత్సరం వయస్సు నుంచి 25 సంవత్సరాల మధ్య డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.. అయితే ప్రమాదవ శాత్తు పాలసీదారుడు మరణిస్తే భీమా కింద పది లక్షలు పొందుతారు..
ఈ పాలసీకి అమ్మాయి కనీస వయస్సు ఏడాది ఉండాలి.. కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం అలాగే తండ్రి వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంటుంది.. ఈ పథకంలో డబ్బులను పెడితే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.. భారీ మొత్తం అమౌంట్ సేవ్ అవుతుంది.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు..
