Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..
- కొబ్బరి కాయ కొనే సమయంలో ఈ టిప్స్ పాటించండి..
- కొబ్బరి నీళ్లు చూస్తేనే కనిపెట్టవచ్చు..
- ఈ ఐదు చిట్కాలు మీకోసం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలంలో దాహాన్ని తీర్చి, శరీరానికి శక్తినిచ్చే అమృతం లాంటిది కొబ్బరి నీళ్లు. అయితే.. కొబ్బరి బొండం కొనేటప్పుడు అందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా మందికి ఒక సవాలుగా మారుతుంది. బయటకు గ్రీన్ గా కనిపించినా.. లోపల నీళ్లు తక్కువగా ఉండటం లేదా పుల్లగా ఉండటం మనం చూస్తుంటాం. మరి ఎక్కువ నీళ్లున్న కొబ్బరి బొండాన్ని ఎలా ఎంచుకోవాలో ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరి!
1. బొండం పరిమాణం, ఆకారం..
చాలామంది పెద్దగా ఉన్న బొండాల్లో ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు. కానీ అది ఎప్పుడూ నిజం కాదు. మరీ పెద్దగా కాకుండా, మధ్యస్థ పరిమాణంలో ఉండి.. గుండ్రంగా ఉన్న బొండాల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. పొడవుగా ఉన్న వాటి కంటే గుండ్రని ఆకారంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.
Also Read
- Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
- Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
- Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే 'వెజిటబుల్ బిర్యానీ' ఇలా చేసేయండి..!
- Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
2. రంగును గమనించండి..
కొబ్బరి బొండం పచ్చగా (Green) ఉండాలి. గోధుమ రంగులోకి మారుతున్నా లేదా పైన మచ్చలు ఎక్కువగా ఉన్నా అది ముదిరిపోయిందని అర్థం. ముదిరిన కొబ్బరిలో నీరు తక్కువగా ఉండి, కొబ్బరి గంజి (మీగడ) గట్టిగా మారుతుంది. నీళ్లు ఎక్కువగా కావాలనుకునే వారు లేత పచ్చ రంగులో ఉన్న వాటినే ఎంచుకోవాలి.
Also Read:Gold Mine: బంగారం కోసం మొదలైన వేట.. వారానికి ఒక గ్రాము గోల్డ్..
3. షేక్ టెస్ట్
నీళ్లు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం బొండాన్ని చెవి దగ్గర పెట్టుకుని ఊపడం. బొండాన్ని ఊపినప్పుడు నీటి శబ్దం ఎక్కువగా వినిపిస్తే, అందులో ఖాళీ చోటు ఉందని, అంటే నీరు తక్కువగా ఉందని అర్థం. అదే శబ్దం అసలు రాకపోతే లేదా చాలా తక్కువగా వినిపిస్తే.. ఆ బొండం నిండా నీరు ఉన్నట్లు లెక్క.
4. కాడ భాగాన్ని పరిశీలించడం..
కొబ్బరి బొండం పైన ఉండే కాడ (చివరన ఉండే చిన్న ముక్క) భాగాన్ని చూడండి. అది తేమగా ఉంటే అది తాజాగా ఉందని అర్థం. ఒకవేళ అది ఎండిపోయి ఉంటే, ఆ బొండం కోసి చాలా రోజులయ్యిందని… లోపల నీటి రుచి మారిపోయే అవకాశం ఉందని గుర్తించాలి.
5. కొబ్బరి కుడక కోసం..
కేవలం నీళ్లు మాత్రమే కాకుండా, లేత కొబ్బరి కూడా కావాలనుకునే వారు బొండాన్ని కొట్టేటప్పుడు దానికి ఉన్న పీచును గమనించాలి. బొండం గట్టిగా ఉంటే కొబ్బరి కట్టి ఉంటుంది.. మెత్తగా ఉంటే కేవలం నీళ్లు మాత్రమే ఉంటాయి.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి తగినట్లుగా తీయటి, చల్లని కొబ్బరి నీళ్లను ఆస్వాదించవచ్చు. ఎండల తీవ్రత నుంచి తప్పుకోవడానికి ఇది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!