NTV Telugu Site icon

Liam Neeson: భార్య మాట విని జేమ్స్ బాండ్ పాత్రను వదులుకున్న హీరో!

Liam Neeson

Liam Neeson

Liam Neeson: చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపం. ఆరడుగులకు పైగా ఎత్తు. ముఖ్యంగా యాక్షన్ హీరోకు కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న లియామ్ నీసన్ కు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే అవకాశం వచ్చిందట! కానీ, లియామ్ నీసన్ ను ఆయన భార్య నటాషా రిచర్డ్ సన్ ఆ పాత్ర పోషించనివ్వకుండా చేసిందట! జేమ్స్ బాండ్ లాంటి విశ్వవిఖ్యాత పాత్రను పోషించే ఛాన్స్ దొరికితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది తన భర్త ఆ పాత్ర పోషించకుండా నటాషా ఎందుకు అడ్డుకుంది?

Read Also: Ileana D’Cruz: ఇలియానా ఆ ఆలోచనలో ఉందా!?

లియామ్ నీసన్ పేరు చెప్పగానే ఎవరికైనా స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన ‘షిండ్లర్స్ లిస్ట్’ గుర్తుకు వస్తుంది. అందులో లియామ్ పోషించిన ఆస్కార్ షిండ్లర్ పాత్రను ఎవరూ మరచిపోలేరు. ఆ తరువాతనే లియామ్ కు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే అవకాశం తలుపు తట్టింది. జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాత పలుమార్లు లియామ్ ను సంప్రదించారట. తనకూ జేమ్స్ బాండ్ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేదని, అయితే తన భార్య ‘జేమ్స్ బాండ్ పాత్ర పోషిస్తే, నీకు నేను ఉండను’ అని వార్నింగ్ ఇచ్చిందట. దాంతో ఆ పాత్రకు నో చెప్పకుండా ఉండలేక పోయానని లియామ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. లియామ్ వద్దన్న తరువాతే జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెయిగ్ ను ఎంచుకున్నారు. ఆ తరువాత డేనియల్ నాయకునిగా “కాసినో రాయలే, క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కై ఫాల్, స్పెక్టర్, నో టైమ్ టు డై” వంటి జేమ్స్ బాండ్ సినిమాలు రూపొందాయి. భార్య మాటకు ఎంతో విలువనిచ్చారు లియామ్. నిజంగానే నటాషాను ఆయన ఎంతో ప్రేమించారు. 1994లో లియామ్, నటాషా పెళ్ళాడారు. 2009లో నటాషా కన్నుమూశారు. ఇప్పటికీ లియామ్ ఆమెనే తలచుకుంటూ ఒంటరిగానే ఉండడం ఆశ్చర్యం కలిగించక మానదు.

Show comments