NTV Telugu Site icon

Lexi: ఇండియా మొట్టమొదటి చాట్‌బాట్ ‘లెక్సీ’..బెనిఫిట్స్ ఇవే!

6

6

చాట్‌జీపీటీ సేవలు క్రమంగా వివిధ కంపెనీల ప్రోడక్టులకు విస్తరిస్తున్నాయి. ఈ లేటెస్ట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్ (కృత్తిమ మేధ)టెక్నాలజీని తమ ఉత్పత్తుల్లో ఉపయోగించేందుకు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో చాలా కంపెనీలు నడుస్తున్నాయి. చాట్‌జీపీటీ సాయంతో తమ ప్రోడక్టులను మరింత ప్రొడక్టివ్‌గా చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే స్వదేశీ ఫైనాన్షియల్‌ టెక్‌ కంపెనీ వెలాసిటీ సోమవారం ‘లెక్సీ’ పేరిట ఇండియాలో మొట్ట మొదటి ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్‌ చేసింది. ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్‌ చేసిన చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్‌తో ఈ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also Read: Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక

కంపెనీ ప్రకారం, వెలాసిటీ ఇన్‌సైట్‌లను ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌యాప్‌ వాట్సాప్‌ ఇంటర్‌ఫేస్‌లో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేసింది. తద్వారా ఈ-కామర్స్‌ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు, రోజువారీ వ్యాపార నివేదికలు (ఇన్‌సైట్స్‌ )పంపిస్తుందనీ, క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ ఇన్‌సైట్స్‌ తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్‌ప్రో సీఈవో, పౌండర్‌ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్

Show comments