NTV Telugu Site icon

Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Vote

Revanth Reddy Vote

CM Revanth Reddy Cast his Vote: ఓటు వేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు వెళ్లారు. జిల్లా పరిషత్‌ స్కూలులోని పోలింగ్‌ కేంద్రంలో రేవంత్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం సతీమణి, ఆయన కూతురు కూడా కొడంగల్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్‌ రెడ్డి తన వేలిని మీడియాకి చూపించారు. ఆపై అక్కడి స్థానికులతో సీఎం మాట్లాడారు.

తాను ఓటు వేశానని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ‘వేలిపై సిరా చుక్క.. ఐదేళ్ల కోసం ఓటరు రాసే ఈ దేశపు తలరాత. ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం. కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్‌లో ఓటు వేసా. మీరూ ఓటు వేయండి’ అని సీఎం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Show comments