Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా కొనుగోలు చేసినా, కాల్చినా జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదంటూ బుధవారం ఢిల్లీ సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సర్కారు తీసుకున్న బాణాసంచా నిషేధం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరం విచారించాలన్న డిమాండ్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలను కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి.. అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణాసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని న్యాయస్థానం సూచించింది.
Rajasthan: ‘మా అమ్మ నిద్రపోతోంది, డిస్టర్బ్ చేయొద్దు’.. తల్లి మృతదేహం వద్ద రెండేళ్ల చిన్నారి
ఇదిలా ఉండగా.. ఈ దీపావళికి బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బాణాసంచా కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానాతో పాటు 6నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు ఢిల్లీ సర్కారు ఈ ఏడాది కూడా బాణాసంచా ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, పేల్చడాన్ని నిషేధించిందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఉంటాయన్నారు. ఢిల్లీలో బాణాసంచా విక్రయం లేదా నిల్వచేస్తే రూ.5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చని ఆయన చెప్పారు. దీపావళికి ముందు పటాకులు పేల్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఐపీసీ సెక్షన్ 268 ప్రకారం.. పటాకులు పేల్చేవారిపై రూ. 200 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందని చెప్పారు.
