NTV Telugu Site icon

Leopard: బిందెలో ఇరుక్కున్న చిరుతపులి తల.. 5 గంటలపాటు నరకయాతన

Keopard

Keopard

ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి తల ప్రమాదవశాత్తూ బిందెలో ఇరుక్కుపోయింది. దీంతో 5 గంటల పాటు నరకయాతన పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఓ పశువుల పాకలోకి ఆహారం కోసమని వచ్చిన చిరుత.. ప్రమాదవశాత్తు తల బిందెలో ఇరుక్కు పోయింది. కాగా.. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Somnath: ఆ రోజే క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.. కీలక విషయాలు బయటపెట్టిన ఇస్రో చీఫ్

పశు వైద్యులు చిరుతకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి పంపించారు. అనంతరం మెటల్‌ కట్టర్‌తో బిందెను తొలగించారు. ఐదు గంటలపాటు శ్రమించి చిరుతను సురక్షితంగా రక్షించారు. చిరుతను బోనులో బంధించి స్థానిక అడవిలో వదిలేసినట్లు కొండైబారి అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సవితా సోనావానే తెలిపారు.

Read Also: Fighter OTT: ముందుగానే ఓటీటీలోకి ‘ఫైటర్‌’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2022 విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘భారతదేశంలో 13,874 చిరుతలు ఉన్నట్లు అంచనా వేశారు. 2018లో 12,852 చిరుతలు ఉంటే.. 2022 నాటికి 8 శాతం అంటే 13,874కి పెరిగాయని అంచనా వేశారు.